‘పెద్ది’ సక్సెస్‌పై అల్లు అర్జున్ పోస్ట్, రామ్ చరణ్ క్రేజీ రిప్లై

  • 'పెద్ది' సినిమా నేపథ్యంలో చరణ్ కు అభినందనలు తెలుపుతూ బన్నీ పోస్ట్
  • నీ విషెస్ నాకు ఎంతో ప్రత్యేకం అన్న చరణ్
  • బన్నీ తదుపరి మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు వెల్లడి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. జూన్ 4న విడుదలైన ఈ క్లాసిక్ విలేజ్ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ‘పెద్ది’ చిత్ర బృందానికి, ముఖ్యంగా తన బ్రదర్ రామ్ చరణ్‌కు అభినందనలు తెలుపుతూ ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.


తాజాగా అల్లు అర్జున్ అభినందనలపై రామ్ చరణ్ స్పందించారు. అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్‌ను రీ-షేర్ చేస్తూ.. "నీ విషెస్ నాకు, అలాగే మా మొత్తం ‘పెద్ది’ టీమ్‌కు ఎంతో ప్రత్యేకం బన్నీ. థాంక్యూ సో మచ్" అంటూ చరణ్ తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. అంతేకాదు, ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రాకా’ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.


స్టార్ హీరోలు ఇద్దరూ ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ, ఇలా ఒకరికొకరు సపోర్ట్‌గా నిలవడం ఇండస్ట్రీలో ఒక గొప్ప హెల్తీ వాతావరణానికి నిదర్శనమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హీరోల మధ్య ఉన్న ఈ బాండింగ్ చూసి అటు మెగా, ఇటు అల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Ram Charan
Allu Arjun
Peddi movie success
Buchi Babu Sana
Raaka movie
Tollywood movie news

More Telugu News